Maoists: పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత సుధాకర్.. తలపై కోటి రూపాయల రివార్డు

  • గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుధాకర్
  • భార్య మాధవితో కలిసి రాంచీ పోలీసుల ఎదుట లొంగుబాటు
  • నేడు అధికారికంగా వెల్లడించనున్న పోలీసులు
మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ అలియాస్ కిరణ్  పోలీసులకు లొంగిపోయినట్టు తెలుస్తోంది. జార్ఖండ్ మావోయిస్టు కార్యకలాపాల్లో క్రియాశీలకంగా ఉన్న సుధాకర్ 2013 నుంచి కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నాడు. తెలంగాణలోని నిర్మల్ జిల్లా సారంగాపూర్‌కు చెందిన సుధాకర్‌పై కోటి రూపాయల రివార్డు కూడా ఉంది.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుధాకర్ భార్య మాధవితో కలిసి రాంచి పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు సమాచారం.  ఈ విషయాన్ని నేడు మీడియా సమావేశంలో పోలీసులు వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. కాగా, తెలంగాణలోనూ సుధాకర్‌పై పలు కేసులు ఉన్న నేపథ్యంలో అతడిని రాష్ట్రానికి తీసుకొచ్చి విచారించే అవకాశం ఉన్నట్టు సమాచారం.  
Maoists
Sudhakar
Madhavi
Jarkhand
Ranchi
Naxals
Telangana

More Telugu News