Andhra Pradesh: దేశంలో ప్రధాని నరేంద్ర మోదీని మించిన నటులు లేరు!: చంద్రబాబు

  • నన్ను మోదీ వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు
  • నేను అలాగే చేస్తే తలెక్కడ పెట్టుకుంటారు?
  • ధర్మపోరాటం ముగింపు ప్రసంగంలో ఏపీ సీఎం
ప్రధాని నరేంద్ర మోదీ కంటే మించిన నటులు దేశంలో ఎవ్వరూ లేరని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. తనను ప్రధాని వ్యక్తిగతంగా విమర్శించారనీ,  తాను అలాగే విమర్శిస్తే తల ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. ఈ ధర్మపోరాట దీక్షకు హాజరైన రాజకీయ పార్టీల నేతలు, వ్యక్తులకు చంద్రబాబు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం మాట్లాడుతూ.. ఈరోజు సభతో మనం ఏకాకులం కాదనీ, దేశంలోని రాజకీయ పక్షాలన్నీ మనతో ఉన్నాయని ధైర్యం కలిగిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇది ఏపీ ప్రభుత్వం సాధించిన నైతిక విజయమనీ, దేశమంతా ఏపీకి అండగా నిలబడిందని అన్నారు.

జేఏసీ రూపంలో ముందుకు పోవడానికి ఇప్పటివరకూ మూడు అఖిలపక్ష సమావేశాలు నిర్వహించామని వెల్లడించారు. ఈ మూడు భేటీలకు బీజేపీ, వైసీపీ తప్ప అందరూ వచ్చారన్నారు. కొందరైతే ఓ సమావేశానికి వచ్చి, ఆ తర్వాత గైర్హాజరు అయ్యారని అన్నారు. ధర్మపోరాట దీక్షతో దేశాన్ని కదిలించడమే కాకుండా ఏపీకి జరిగిన అన్యాయంపై దేశమంతటా చాటిచెప్పామని పేర్కొన్నారు.
Andhra Pradesh
Chandrababu
DHARMA PORATA DEEKSHA
best actor
moral victory

More Telugu News