India: ట్విట్టర్ అకౌంట్ తెరిచిన ప్రియాంకా గాంధీ.. నిమిషాల్లోనే 45 వేల మంది ఫాలోవర్స్!

  • ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు
  • యూపీ తూర్పు విభాగం ఇన్ చార్జీగా నియామకం
  • 45,500 ఫాలోవర్స్ ను సంపాదించుకున్న ప్రియాంక
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంకా గాంధీ ఇటీవల ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా యూపీ తూర్పు విభాగం చీఫ్ గా ఆమెను రాహుల్ నియమించారు. తాజాగా ప్రజలు, కార్యకర్తలతో మమేకం అయ్యేందుకు ప్రియాంకా గాంధీ ట్విట్టర్ ఖాతాను ప్రారంభించారు. ప్రియాంక ట్విట్టర్ అకౌంట్ ను ప్రారంభించిన నిమిషాల్లోనే ఆమె ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా 45,500కు చేరుకుంది. కాగా, అకౌంట్ ప్రారంభించినప్పటికీ ప్రియాంక ఎలాంటి ట్వీట్లు చేయలేదు.
India
Twitter
Congress
priyanka gandhi
45 k folloers

More Telugu News