Rajanikant: అంగరంగ వైభవంగా సౌందర్య వివాహం... హాజరైన పళనిస్వామి, పన్నీర్ సెల్వం... కుటుంబంతో కలసి వచ్చిన మోహన్ బాబు!

  • ముగిసిన వివాహ వేడుక
  • తరలివచ్చిన వీఐపీలు
  • చెన్నై లీలా ప్యాలెస్ లో వివాహం
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య వివాహం నటుడు, బిజినెస్ మేన్ విశాగన్ తో ఈ ఉదయం ఘనంగా జరిగింది. చెన్నైలోని లీలా ప్యాలెస్ లో వివాహం అంగరంగ వైభవంగా జరుగగా, పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. తమిళనాడు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంలు వచ్చారు. రజనీకాంత్ కు చిరకాల మిత్రుడైన మోహన్ బాబు, తన కుటుంబీకులతో కలిసి వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. మూడు రోజుల పాటు వైభవంగా జరిగిన పెళ్లి, నేడు ముగిసింది. కాగా, తమ తొలి వివాహాల రద్దు తరువాత సౌందర్య, విశాగన్ లు ప్రేమించుకుని, పెద్దల సమ్మతితో ఇప్పుడు ఒకటయ్యారు. 
Rajanikant
Soundarya
Vishagan
Marriage
Mohanbabu

More Telugu News