media: మా సూచనల మేరకే వార్తలిచ్చే రెండు చానళ్లు మాకూ ఉన్నాయి : సుబ్రహ్మణ్యస్వామి

  • మా గొంతు వాటిలో ఎప్పటికప్పుడు ప్రతిధ్వనిస్తుంది
  • మీడియా అంతా మాకేమీ వ్యతిరేకం కాదు
  • ఆదాయ పన్ను ఎత్తేయాలని ఇటీవల సూచించిన స్వామి
తన వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో ఉండే బీజేపీ సీనియర్‌ నాయకుడు, న్యాయవాది సుబ్రహ్మణ్యస్వామి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా అంతా తమకేమీ వ్యతిరేకంగా లేదని, తమ గొంతు వినిపించే తోలుబొమ్మ చానళ్లు తమకు కూడా ఉన్నాయని అన్నారు. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, 'మా సూచనల మేరకే వార్తలు ప్రసారం చేసే రెండు చానళ్లు ఉన్నాయి. అందువల్ల  మీడియా అంతా మాకు వ్యతిరేకమని భావించడం లేదు' అని చెప్పారు.

 వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే ఆదాయ పన్నును పూర్తిగా ఎత్తేయాలని ఇటీవల సొంత సర్కారుకు సూచించి సుబ్రహ్మణ్యస్వామి సంచలనం రేపిన విషయం తెలిసిందే. వ్యవసాయ రంగంలో ఉన్నవారు ఎలాగూ పన్ను చెల్లించరని, ధనవంతుల వద్ద చార్టెడ్‌ అకౌంటెంట్లు ఉంటారు కాబట్టి, అన్ని అడ్జెస్ట్‌మెంట్లు చేశాక వారు చెల్లించేది అతి తక్కువని, ఈ పరిస్థితుల్లో పన్ను విధానాన్ని ఎత్తేయడమే ఉత్తమమని సుబ్రహ్మణ్యస్వామి అభిప్రాయపడ్డారు.
media
subrahmanyaswaamy
mumbai

More Telugu News