Amalapaul: 21 కిలోమీటర్లు పరిగెత్తిన హీరోయిన్ అమలాపాల్!

  • పుదుచ్చేరిలో మారథాన్ పోటీలు
  • 10, 21, 40 కిలోమీటర్ల పోటీలు
  • ఉత్సాహంగా పాల్గొన్న అమలాపాల్
పుదుచ్చేరిలో జరిగిన మారథాన్‌ పోటీల్లో పాల్గొని, 21 కిలోమీటర్ల దూరం పరిగెత్తిన హీరోయిన్ అమలాపాల్, పోటీల్లో పాల్గొన్న ఔత్సాహికులకు ఆదర్శంగా నిలిచింది. ప్రతి ఏటా నిర్వహించే మారథాన్‌ పోటీల్లో భాగంగా 10, 21, 40 కిలోమీటర్ల పరుగు పందాలు జరిగాయి. మందిర్‌ సెంటర్‌ నుంచి మారథాన్ ప్రారంభం కాగా, దాదాపు 3 వేల మందికి పైగా పాల్గొన్నారు. రైల్వే శాఖ ఏటీజీపీ శైలేంద్రబాబు నేతృత్వంలో రైల్వే పోలీసుల బృందంతో పాటు మహిళా కమాండర్ల బృందం కూడా పోటీల్లో పాల్గొంది. ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న అమలాపాల్ మొత్తం మారథాన్ కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Amalapaul
Puducheri
Marathan

More Telugu News