Andhra Pradesh: అప్పుడు మంత్రులు పనిచేసేవారు కాదు.. ఇప్పుడు నేను చేస్తుంటే అలా అంటున్నారు: ఏపీ మంత్రి నారాయణ ఆవేదన

  • నేను చీకటి మంత్రినా?
  • ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి నారాయణ
  • ప్రజల కోసం ఎంతసేపు పనిచేయడానికైనా సిద్ధమని వ్యాఖ్య
ఒకప్పుడు మంత్రులు పనిచేసేవారు కాదని, ఉదయం 11 గంటలు దాటినా బయటకు వచ్చేవారు కాదని ఏపీ మంత్రి నారాయణ అన్నారు. తానిప్పుడు నిత్యం ప్రజల్లోనే ఉంటుంటే చీకటి మంత్రి అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరులో ఆదివారం ఆకస్మికంగా పర్యటించిన మంత్రి.. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.  అనంతరం ఓ చానల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రజల కోసం ఎంతసేపు పనిచేయడానికైనా తాను సిద్ధమన్న మంత్రి నారాయణ.. తనను చీకటి మంత్రిగా అభివర్ణించడం బాధగా ఉందన్నారు. మంత్రి నారాయణ సమయం కాని సమయంలో ఆకస్మిక తనిఖీలకు వస్తారని, ఆయన వస్తే నిద్రలు ఉండవన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనను కొందరు చీకటి మంత్రిగా అభివర్ణించారు. ఇప్పుడా విషయాన్ని ప్రస్తావించి మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
Andhra Pradesh
Narayana
Nellore District
Minister

More Telugu News