Naga Jhansi: సినిమాల్లో ఆఫర్లు ఇప్పిస్తామని వాళ్లిద్దరూ ఝాన్సీని మోసం చేశారు: విచారణలో సూర్యతేజ

  • బాబి, గిరి అనే ఇద్దరు ఫొటో షూట్ చేసేవారు
  • నమ్మొద్దని పలుమార్లు ఝాన్సీకి చెప్పాను
  • గిరికి నేను ఒకసారి వార్నింగ్ ఇచ్చాను
బుల్లితెర నటి నాగ ఝాన్సీ ఆత్మహత్య కేసులో కొత్తకోణం వెలుగు చూసింది. ఆమె ప్రియుడు సూర్యతేజ ఆమె ఆత్మహత్యకు సంబంధించి కొత్త విషయాలను వెల్లడించాడు. నేడు సూర్యతేజను పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో సూర్య చెబుతూ ‘‘ఝాన్సీకి బాబి, గిరి అనే ఇద్దరు ఫొటో షూట్ చేసేవారు. ఆ ఇద్దర్నీ నమ్మొద్దని పలుమార్లు ఝాన్సీకి చెప్పాను. సినిమాల్లో ఆఫర్లు ఇప్పిస్తామని ఆమెను మోసం చేశారు. గిరి పలుమార్లు ఇబ్బంది పెట్టాడని ఝాన్సీ నాకు చాలాసార్లు చెప్పింది. దీంతో గిరికి నేను ఒకసారి వార్నింగ్ కూడా ఇచ్చాను. సినిమా ఆఫర్లు తగ్గడంతోనే ఝాన్సీ ఆత్మహత్య చేసుకుంది’’ అని చెప్పుకొచ్చాడు. సూర్యతేజ వ్యాఖ్యలతో పోలీసులు బాబి, గిరిని కూడా అదుపులోకి తీసుకుని విచారించనున్నట్టు తెలుస్తోంది.
Naga Jhansi
Bobby
Giri
Suryateja
Punjagutta

More Telugu News