modi: మోదీకి భార్య ఉందనే విషయం మీకు తెలుసా?: చంద్రబాబు

  • నన్ను లోకేష్ తండ్రి అని అన్నందుకు సంతోషిస్తున్నా
  • మోదీకి కుటుంబ వ్యవస్థపై గౌరవం లేదు
  • గురివింద గింజలా మోదీ వ్యవహరిస్తున్నారు
ప్రధాని మోదీపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుంటూరు సభలో తనను పదేపదే లోకేష్ తండ్రి అంటూ మోదీ అనడంపై స్పందిస్తూ... ప్రధాని తనను లోకేష్ తండ్రి అన్నారని, దానికి తాను సంతోషిస్తున్నానని చెప్పారు. మోదీకి కుటుంబ వ్యవస్థపై గౌరవం లేదని, ఆయనకు ఎలాంటి బంధాలు లేవని విమర్శించారు.

తాను కుటుంబ వ్యవస్థకు గౌరవం ఇచ్చే వ్యక్తినని తెలిపారు. మోదీకి భార్య ఉందని, ఆ విషయం మీకు తెలుసా? అని ప్రశ్నించారు. ట్రిపుల్ తలాక్ చెల్లదని తెలిసి కూడా చట్టాన్ని తీసుకొచ్చారని అన్నారు. తాము వ్యక్తిగత జీవితాలను కూడా వదులుకొని రాష్ట్రాభివృద్ధి కోసం పని చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను సాధించి తీరుతామని తెలిపారు. గురివింద గింజలా మోదీ వ్యవహరిస్తున్నారని అన్నారు.  
modi
Chandrababu
bjp
Telugudesam

More Telugu News