new zealand: భారత్ విజయలక్ష్యం 213 పరుగులు.. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా

  • 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసిన కివీస్
  • 72 పరుగులు చేసిన మన్రో
  • 5 పరుగులకే ఔటైన ధావన్
వెల్టింగ్టన్ లో జరుగుతున్న చివరి టీ20లో న్యూజీలాండ్ 4 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఓపెనర్లు మన్రో 72, సీఫ్రెట్ 43 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అనంతరం విలియంసన్ 27, గ్రాండ్ హోమ్ 30 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. మిచెల్ 19, టేలర్ 14 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీయగా... భువనేశ్వర్, అహ్మద్ లు చెరో వికెట్ తీశారు.

అనంతరం 213 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ధావన్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి శాంట్నర్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. రోహిత్ శర్మ 22, విజయ శంకర్ 24లు క్రీజులో ఉన్నారు. భారత్ ప్రస్తుత స్కోరు 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 57 పరుగులు.
new zealand
india
t20

More Telugu News