Andhra Pradesh: గుంటూరులో ‘మోదీ-జగన్’ పోస్టర్లు ప్రత్యక్షం.. 'పచ్చపకోడి గాళ్లారా'.. అంటూ నిప్పులు చెరిగిన కొడాలి నాని!

  • నేడు ప్రధాని ప్రజా చైతన్య సభ
  • స్వాగతం పలుకుతూ వైసీపీ పోస్టర్లు ప్రత్యక్షం
  • దమ్ముంటే తన దగ్గరకు రావాలని నాని సవాల్
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఈరోజు బీజేపీ నిర్వహించిన ‘ప్రజా చైతన్య సభ’లో ప్రధాని మోదీ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సభ నేపథ్యంలో గుంటూరులో ‘ప్రధాని మోదీ-వైసీపీ అధినేత జగన్-గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని’ ఫొటోలతో పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. ‘ప్రధాని మోదీకి ఆత్మీయ స్వాగతం’ పేరుతో ఈ పోస్టర్లను గుర్తుతెలియని వ్యక్తులు ముద్రించారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత నాని టీడీపీ శ్రేణులపై నిప్పులు చెరిగారు.
ఈరోజు ట్విట్టర్ లో నాని స్పందిస్తూ..‘పచ్చ పకోడీగాళ్ళారా.. దమ్ముంటే నా దగ్గరికి రండి, సమాధానం చెప్తా. ఇలా మీకు మీరే జగనన్న ఫొటో, నా ఫొటో పెట్టి బ్యానర్లు వేసుకుని శునకానందం పొందడం ఏందిరా సుంటల్లారా. నాలుగేళ్ళు మోడీ సంకనాకింది ఎవరు? నాలుగేళ్ళు కాపురం చేసింది మీరు, మేం కాదు. మోడీ అయినా, చంద్రబాబు లాంటి కేడీ అయినా మాకు ఒక్కటే’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
Andhra Pradesh
Chandrababu
Narendra Modi
Jagan
PICS
YSRCP
Kodali Nani
Twitter
ANGRY

More Telugu News