Andhra Pradesh: తండ్రీకొడుకుల అవినీతి ప్రభుత్వం పోవాల్సిన టైమ్ వచ్చింది.. బీజేపీ సభకు దిష్టి తీసినందుకు థ్యాంక్స్!: ప్రధాని మోదీ

  • చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మలేదు
  • అవినీతి రహిత ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు
  • గుంటూరు జన చైతన్య సభలో మాట్లాడిన మోదీ
ఏపీ సీఎం చంద్రబాబు తప్పుడు మాటలను కాదని రాష్ట్ర ప్రజలు భారీ సంఖ్యలో గుంటూరు సభకు వచ్చారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఏపీలో తండ్రీకొడుకుల (చంద్రబాబు-లోకేశ్) అవినీతి ప్రభుత్వం పోవాల్సిన సమయం ఆసన్నమయిందని వ్యాఖ్యానించారు. అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని మోదీ అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల తర్వాత అవినీతి రహిత ప్రభుత్వం ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. గుంటూరు జిల్లా ఏటుకూరులో ఈరోజు నిర్వహించిన ప్రజా చైతన్య సభలో ప్రధాని మాట్లాడారు.

సాధారణంగా ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు దిష్టి తగలకుండా పెద్దలు నల్ల చుక్క పెడతారని ప్రధాని అన్నారు. గుంటూరులో జరుగుతున్న బీజేపీ సభకు దిష్టి తగలకుండా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, టీడీపీ నేతలు నల్ల బెలూన్లను ఎగురవేశారనీ, ఇందుకోసం ధన్యవాదాలని మోదీ అన్నారు. అనంతరం జై ఆంధ్రా, భారత్ మాతాకీ జై అని నినాదాలతో సభను ముగించారు.
Andhra Pradesh
Chandrababu
Nara Lokesh
Telugudesam
Guntur District
BJP
Narendra Modi

More Telugu News