valavala mallikharjun: వైసీపీకి రాజీనామా చేసిన రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జునరావు

  • పార్టీలో గౌరవం లేదని వాపోయిన మల్లికార్జునరావు 
  • జగన్ అపాయింట్ మెంట్ కూడా దొరకడం లేదని ఆవేదన
  • పార్టీ కోసం పని చేసిన వారికి అన్యాయం జరుగుతోందని ఆరోపణ
వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అమలాపురం పార్లమెంటరీ పార్టీ పరిశీలకుదు వలవల మల్లికార్జునరావు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ,  మొదటి నుంచి పార్టీ ఉన్నతి కోసం పనిచేశానని చెప్పారు. తాడేపల్లిగూడెంలో పార్టీకి నాయకుడు కూడా లేకపోతే తానే జెండా మోసి సేవ చేశానని తెలిపారు. ప్రస్తుతం ఉన్న కన్వీనర్ తనను కలుపుకుని పోవడం లేదని, పార్టీ కోసం పని చేసిన వారికి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. పార్టీ అధినేత జగన్ అపాయింట్ మెంట్ కూడా దొరకని పరిస్థితి నెలకొందని చెప్పారు. పార్టీలో తనకు గౌరవం లేదని, అందుకే రాజీనామా చేస్తున్నానని తెలిపారు.
valavala mallikharjun
ysrcp
amalapuram
tadepalligudem

More Telugu News