Narendra Modi: నరేంద్ర మోదీ సభకు అంతంతమాత్రంగానే జనాలు... టీడీపీయే కారణమన్న బీజేపీ నేతలు!

  • మూడు కిలోమీటర్ల దూరంలోనే ప్రజలను అడ్డుకుంటున్నారు
  • ఆరోపించిన బీజేపీ నేత విజయబాబు
  • నిరసనలు తెలియజేస్తున్న టీడీపీ వర్గాలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు గుంటూరు జిల్లాలో తలపెట్టిన సభకు ప్రజల స్పందన అంతంతమాత్రంగానే ఉంది. ఆయన రాకను నిరసిస్తూ, ప్రజలు పెద్దఎత్తున నిరసనలు తెలియజేస్తుండగా, పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఈ సభకు ప్రజలు పెద్దఎత్తున తరలివస్తుండగా, పోలీసులు అడ్డుకుంటున్నారని బీజేపీ నేత, మాజీ సమాచార కమిషనర్ విజయబాబు ఆరోపించారు.

 సభలో ఉన్నవారికి 10 రెట్లు ఎక్కువ మంది రావాల్సివుందని, కానీ, సభకు మూడు కిలోమీటర్ల దూరంలోనే వేలాది మందిని నిలిపివేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను తెలుగుదేశం పార్టీ ఎలా మోసం చేస్తుందో ఈ సభలో మోదీ తెలియజెప్పనున్నారని, అదే టీడీపీ నేతల్లో తీవ్ర భయాందోళనలను కలిగిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
Narendra Modi
Guntur District
Telugudesam
Vijayababu

More Telugu News