Telangana: ఐదారు రోజుల్లోనే క్యాబినెట్ విస్తరణ... తేల్చేసిన కేసీఆర్!

  • ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ
  • చర్చకు వచ్చిన విస్తరణ అంశం
  • పుట్టినరోజు లోగా విస్తరణ
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుందన్న విషయాన్ని కేసీఆర్ తేల్చేశారు. ఈ విషయమై ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలతో మాట్లాడిన ఆయన, వచ్చే ఐదారు రోజుల్లోనే విస్తరణ ఉంటుందని అన్నారు. భవిష్యత్తులో హైదరాబాద్ మహానగరం ఎలా ఉండాలన్న విషయమై ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించిన ఆయన, ఆపై పలువురు ఎమ్మెల్యేలు, నేతలతో సమావేశం అయ్యారు.

 ఈ సమావేశంలో విస్తరణ అంశం చర్చకు రాగా, తొలిసారిగా స్పందించిన కేసీఆర్, అతి త్వరలోనే ఉంటుందని అన్నారట. ఈ నెల 17వ తేదీన కేసీఆర్ పుట్టినరోజు కాగా, అంతకన్నా ముందే విస్తరణ ఉంటుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇక కేసీఆర్ బర్త్ డే వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి.
Telangana
Cabinet
KCR
Expanssion
Birth Day

More Telugu News