Sivaji: మోదీ రాకముందు నీటిలోకి దిగుతా... ఆయన వెళ్లిపోయిన తరువాతే బయటకు: నటుడు శివాజీ నిరసన

  • నేడు ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన
  • ఉదయం 9 గంటల నుంచి శివాజీ జలదీక్ష
  • రాష్ట్రానికి ఎలా వస్తారని ప్రశ్నించిన శివాజీ
ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనుండగా, ఆయన రాకను వ్యతిరేకిస్తూ, నటుడు శివాజీ విజయవాడ, కృష్ణానదిపై ఉన్న దుర్గా ఘాట్ లో జలదీక్ష చేయాలని నిర్ణయించారు. ఈ ఉదయం ప్రధాని రాకముందు నీటిలోకి దిగి, ఆయన తిరిగి వెళ్లిపోయేంత వరకూ నీటిలోనే ఉంటానని, ఉదయం 9 గంటల నుంచి మోదీ పర్యటన ముగిసేంత వరకూ జలదీక్ష జరుగుతుందని ఆయన ప్రకటించారు. నరేంద్ర మోదీ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని, ప్రత్యేక హోదా, రైల్వే జోన్ వంటి విభజన హామీలను నెరవేర్చకుండా ఆయన రాష్ట్రానికి ఎలా వస్తారని శివాజీ ప్రశ్నించారు. కాగా నరేంద్ర మోదీ పర్యటనను పలు వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.
Sivaji
Narendra Modi
Vijayawada
Guntur

More Telugu News