Narendra Modi: మూడు అగ్ర దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచే అవకాశం ఉంది: రాజ్ నాథ్ సింగ్

  • ఇది మోదీ నాయకత్వంలోనే సాధ్యం
  • ఒకప్పుడు పేద దేశాల జాబితాలో భారత్ ఉండేది
  • మోదీ నిజాయతీ గురించి ఎవరూ ప్రశ్నించలేరు
ప్రపంచంలోని మూడు అగ్ర దేశాల్లో ఒకటిగా భారత్ నిలిచే అవకాశం ఉందని, ఇది మోదీ నాయకత్వంలోనే సాధ్యమని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. బీహార్ రాజధాని పాట్నాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు పేద దేశాల జాబితాలో భారత్ ఉండేదని, ఇప్పుడు అత్యంత శక్తిమంతమైన దేశాల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుందని అన్నారు.

ఈ సందర్భంగా మోదీపై వస్తున్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు. రాఫెల్ వ్యవహారంలో మోదీపై రాహుల్ చేస్తున్న ఆరోపణలను రాజ్ నాథ్ ఖండించారు. అసత్య ప్రచారాలు చేస్తూ, దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. మోదీకి సంబంధించి ఇతర విషయాల్లో ఎవరైనా విమర్శలు చేస్తే చేయొచ్చు కానీ, ఆయన నిజాయతీ గురించి మాత్రం ఎవరూ ప్రశ్నించలేరని స్పష్టం చేశారు. మోదీ నాయకత్వంలో ప్రపంచంలో మన దేశానికి ఎన్నడూ లేనంత గుర్తింపు వచ్చిందని ప్రశంసించారు. 
Narendra Modi
Prime Minister
home minister
rajnath
Congress
Rahul Gandhi
rafel

More Telugu News