Andhra Pradesh: హైదరాబాద్ నిమ్స్ లో దారుణం.. ఆపరేషన్ చేసి రోగి కడుపులో కత్తెర మర్చిపోయిన డాక్టర్లు!

  • కడుపునొప్పితో అల్లాడిపోయిన మహేశ్వరి
  • స్కానింగ్ తీయడంతో కత్తెర ఎపిసోడ్ వెలుగులోకి
  • ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు
ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచే ఘటన ఇది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఓ రోగికి ఆపరేషన్ చేసిన వైద్యులు కత్తెరను కడుపులోనే ఉంచి కుట్లు వేసేశారు. చివరికి అతనికి కడుపునొప్పి రావడంతో స్కానింగ్ తీయించగా, లోపల కత్తెర బయటపడింది. ఈ ఘటన తెలంగాణలోని హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

హైదరాబాద్ కు చెందిన మహేశ్వరి చౌదరి హెర్నియా సమస్యతో మూడు నెలల క్రితం ఇక్కడి నిమ్స్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్నారు. అయితే పరిస్థితి మెరుగు కాకపోగా ఆరోగ్యం మరింతగా క్షీణించింది. ఈరోజు తీవ్రంగా కడుపునొప్పి రావడంతో వైద్యులు మహేశ్వరికి స్కానింగ్ చేశారు.

ఈ సందర్భంగా తన కడుపులో కత్తెర ఉన్నట్లు బయటపడటంతో మహేశ్వరి చౌదరి విస్తుపోయారు. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ రోగి కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. దీంతో ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Andhra Pradesh
Telangana
nims
Scissor

More Telugu News