Chandrababu: ఐఆర్ పెంచుతూ.. ప్రభుత్వోద్యోగులకు శుభవార్తను అందించిన చంద్రబాబు

  • 20 శాతం మధ్యంతర భృతి
  • ఏడాదికి రూ.6,884 కోట్ల భారం
  • 40 - 45 శాతం ఇవ్వాలని డిమాండ్
ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వోద్యోగులకు శుభవార్త అందించారు. ఉద్యోగులందరికీ 20 శాతం మధ్యంతర భృతిని ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. దీని కారణంగా ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి రూ.6,884 కోట్ల భారం పడనుంది. 40 నుంచి 45 శాతానికి మధ్యంతర భృతి ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేయగా.. 20 శాతం ఐఆర్ ఇచ్చేందుకు సీఎం అంగీకరించారు.
Chandrababu
IR
Employees
Andhra Pradesh

More Telugu News