Narendra Modi: అందరూ కలిస్తే ఈ ప్రధాని ఏమవుతారో ఆలోచించుకోవాలి: చంద్రబాబు ఫైర్

  • దేశానికి ఏం చేశారో చెప్పుకునే ధైర్యం మోదీకి లేదు
  • దేశానికి ఏం చేద్దామన్న ఆలోచనా ఆయనకు లేదు
  • ఇంక దేశం ఎలా బాగుపడుతుంది?
ఐదేళ్లుగా ప్రధాని మోదీ దేశానికి ఏం చేశారో చెప్పుకునే ధైర్యం ఆయనకు లేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు. ఏపీ అసెంబ్లీలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, దేశానికి ఏం చేద్దామన్న ఆలోచన కూడా మోదీకి లేదని, దీని వల్ల దేశం ఎలా బాగుపడుతుందని ప్రశ్నించారు. రైతులు పండించిన పంటను కొనకుండా, వారి కష్టాలను పట్టించుకోని మోదీ ప్రభుత్వం రాటుదేలిపోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎదురుదాడికి పాల్పడుతున్న మోదీ సర్కార్ చాలా ఘోరంగా వ్యవహరిస్తోందని, నాయకత్వాన్ని చంపేస్తున్నారని, ఇది దేశానికి పెద్ద శాపం అని విరుచుకుపడ్డారు.

రాజకీయనాయకులపై బురద జల్లాలని, కార్పొరేట్ సెక్టర్ ని, మీడియాని కిల్ చేయాలని చూస్తున్నారని.. ఆయనొక్కడే ఉండాలని ప్రధాని మోదీ చూస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందరూ కలిసిన మరుసటి రోజు ఈ ప్రధాన మంత్రి ఏమవుతారో ఆలోచించుకోండంటూ ఏపీ బీజేపీ నేతలను హెచ్చరించారు. కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు  సాక్షాత్తు ప్రధాన మంత్రే అక్కడి ఎమ్మెల్యేలకు  డబ్బులు పంపించి బేరసారాలు చేస్తున్నారని, ఇది ఎంత వరకు కరెక్టు? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రధానికి ఉందా? లేదా? అని ప్రశ్నించారు. తప్పుడు విధానాలను అవలంబిస్తున్న ఎన్డీఏ సర్కార్ కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని, పనిష్ మెంట్ ఇచ్చి తీరతారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ తమకు పట్టం కట్టాలని పవిత్రమైన శాసనసభ నుంచి ప్రజలను కోరుతున్నానని చంద్రబాబు అన్నారు.
Narendra Modi
pm
Andhra Pradesh
Chandrababu
cm
assembly
Karnataka

More Telugu News