sirircilla: సిరిసిల్లలో ఐదు రూపాయలకే రుచికరమైన భోజనం అందిస్తున్నాం: కేటీఆర్

  • సిరిసిల్లలో అక్షయపాత్ర భోజన పథకం ప్రారంభం
  • దీని ద్వారా రోజుకు 540 మందికి భోజనం
  • ఈ పథకం ప్రారంభించడం సంతోషంగా ఉంది: కేటీఆర్
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎమ్మెల్యే కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు ఈరోజు శంకుస్థాపన చేశారు. ఇప్పటికే పూర్తయిన పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్లలో అక్షయపాత్ర రూ.5 భోజన పథకాన్ని ప్రారంభించారు. కేవలం రూ.5 కే ఈ భోజనం అందించనున్నారు. ఈ పథకం ద్వారా రోజుకు 540 మందికి భోజనం లభించనుంది.

ఈ సందర్భంగా కేటీఆర్ స్పందిస్తూ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ భోజన కేంద్రం ప్రారంభించడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని అన్నారు. ఇక్కడ అన్నార్తులకు ఐదు రూపాయలకే రుచికరమైన భోజనం లభిస్తుందని చెప్పారు. కాగా, రాజన్న సిరిసిల్లలోని నెహ్రూ నగర్ లో వైకుంఠ ధామం, ఇందిరా పార్క్, ఏకలవ్య కమ్యూనిటీ హాల్, శాంతినగర్ ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు.
sirircilla
TRS
KTR
annapurna bhojana kendram

More Telugu News