kalyan malik: వర్మ ముసుగులేని మనిషి!: కల్యాణ్ మాలిక్

  • రామ్ గోపాల్ వర్మ నికార్సైన మనిషి
  •  ముసుగేసుకుని బతకడం ఆయనకి చేతకాదు
  • ఆయన బొగ్గు కాదు .. వజ్రం    
కల్యాణ్ మాలిక్ తాజాగా సంగీతాన్ని అందించిన చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్. ఈ సినిమా కోసం రాంగోపాల్ వర్మతో కలిసి కల్యాణ్ మాలిక్ పనిచేశారు. తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ వర్మ గురించి ప్రస్తావించారు. " ఈ సినిమా వలన రాముతో నా సాన్నిహిత్యం మరింత పెరిగింది. ఆయనపై అభిమానం కొండంత అయింది.

వర్మ గురించి చాలామంది భయంకరంగా రాస్తుంటారు .. మాట్లాడుతుంటారు. ఆయన ఎలాంటివాడన్నది తెలిసిన తరువాత నాకు బాధేస్తోంది. నిజంగా ఆయన చాలా నికార్సైన మనిషి. ఎదుటి వ్యక్తికి గౌరవ మర్యాదలు ఇవ్వడం తెలిసిన మనిషి. ఆయన ఏదైతే మాట్లాడుతున్నాడో అదే తను. చాలామందిలా ఆయన మేడిపండు కాదు .. ముసుగేసుకుని బతికేవాడు కాదు. చాలామందికి ఆయన బొగ్గులా కనపడుతుంటాడు .. ఆ బొగ్గులోని డైమండ్ కొంతమందికే కనిపిస్తూ ఉంటుంది." అని చెప్పుకొచ్చారు.
kalyan malik

More Telugu News