Tollywood: కూతురు అర్హతో అల్లు అర్జున్ సరదా ముచ్చట.. వీడియో ఇదిగో!

  • తండ్రీకూతుళ్ల సరదా సంభాషణ
  • అర్జున్ చెప్పిన అబ్బాయిని పెళ్లిచేసుకోనన్న అర్హ
  • కూతురుని ముద్దులతో ముంచెత్తిన అర్జున్
ప్రముఖ హీరో అల్లు అర్జున్ తనకు, తమ పిల్లలకు సంబంధించిన వీడియోలను తరచు పోస్ట్ చేస్తుంటాడు. తాజాగా, తన కూతురు అర్హతో తన సరదా సంభాషణను ఆయన పోస్ట్ చేశాడు. అర్జున్ చెబుతున్న మాటలను అర్హ తిరిగి చెబుతూ.. తండ్రిని ఆటపట్టించింది. ‘నాన్నా.. నేను, నువ్వు చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను’ అని అర్జున్ చెప్పిన మాటలను అర్హ తిరిగి అనడం ఈ వీడియోలో కన్పిస్తుంది. ‘చేసుకుంటావా? చేసుకోవా?’ అని అర్జున్ అడగడం..‘చేసుకోను’ అని అర్హ చెప్పడంతో ‘దొంగ ఫెలో..చేసుకుంటానని చెప్పు’ అని అర్జున్ అంటూ కూతురిని ముద్దులతో ముంచెత్తడం ఈ వీడియోలో కనపడుతుంది.
Tollywood
hero allu arjun
arha

More Telugu News