Chandrababu: చంద్రబాబుకు గిఫ్ట్ ఇచ్చేంతవారైతే.. జగన్ ఇంటికి కేటీఆర్ ను ఎందుకు పంపిస్తారు?: వీహెచ్

  • కేసీఆర్ అవకాశవాద నాయకుడు
  • అవసరమైతే కాళ్లు, లేకపోతే జుట్టు పట్టుకోవడం ఆయన నైజం
  • ఫెడరల్ ఫ్రంట్ ఒక బూటకం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై టీకాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ప్రశంసలు కురిపించారు. ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలన్నింటినీ చంద్రబాబు నెరవేర్చారని కితాబిచ్చారు. కేసీఆర్ అవకాశవాద నాయకుడని అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అన్యాయం జరిగితే కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఒక బూటకమని చెప్పారు. అవసరమైతే కాళ్లు, లేకపోతే జుట్టు పట్టుకోవడం కేసీఆర్ నైజమని దుయ్యబట్టారు. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కేసీఆర్ చెప్పారని... బాబుకు గిఫ్ట్ ఇచ్చేంతవారైతే... జగన్ ఇంటికి కేటీఆర్ ను ఎందుకు పంపిస్తారని ఎద్దేవా చేశారు. 
Chandrababu
vh
jagan
kcr
KTR
mamata banerjee
Telugudesam
TRS
ysrcp
congress

More Telugu News