kalyanmalik: ఒక పాట ఇవ్వమని మా అన్నయ్యని ఎప్పుడూ అడగలేదు!: కల్యాణ్ మాలిక్

  • కీరవాణి వెనుక ఎవరి సపోర్ట్ లేదు
  • రాజమౌళి వెనక వున్నది కష్టమే
  • వాళ్ల లక్షణమే నాకు వచ్చింది  
తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో సంగీత దర్శకుడు కల్యాణ్ మాలిక్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో .."రాజమౌళి .. కీరవాణి ఎప్పుడైనా మీ దగ్గరికి వచ్చి ఎలా వున్నావు .. నీ పరిస్థితి ఎలా వుంది?' అని అడుగుతూ వుంటారా?' అనే ప్రశ్న కల్యాణ్ మాలిక్ కి ఎదురైంది.

అందుకు ఆయన స్పందిస్తూ .. "కీరవాణి అయినా .. రాజమౌళి అయినా కష్టపడి పైకొచ్చిన వాళ్లే. ఎవరి సపోర్ట్ తీసుకోకుండా వాళ్లు తమంత తాముగా కష్టపడుతూ ఈ రోజున ఈ స్థితికి వచ్చారు. ఇదే వ్యక్తిత్వం మిగతా వాళ్లందరికీ వుంది. 'అన్నయ్య .. నీకు తెలిసిన వాళ్లెవరైనా ఉంటే చెప్పు' అని నేను అడగలేదు. అలాగే రాజమౌళి పేరు చెప్పుకుని అవకాశాలు అడగడం కూడా ఎప్పుడూ జరగలేదు. నేను గాయకుడిని అవుదామనుకున్నప్పుడు కూడా ఒక పాట ఇవ్వమని మా అన్నయ్యను అడగలేదు. ఎవరి సిఫార్సులు లేకుండా అవకాశాలు కష్టపడి సంపాదించుకోవాలనే లక్షణం వాళ్ల నుంచే నాకు వచ్చింది" అని చెప్పుకొచ్చారు.
kalyanmalik

More Telugu News