Rajinikanth: రజనీకాంత్ ఇంట పెళ్లి బాజాలు.. సౌందర్య పెళ్లికి కమల్‌ను ఆహ్వానించిన తలైవా

  • ఈ నెల 11న సౌందర్య- విషగన్ వివాహం
  • తొలి పత్రికను తమిళనాడు కాంగ్రెస్ చీఫ్‌కు అందించిన రజనీ
  • రజనీని ఆలింగనం చేసుకున్న కమల్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ వివాహం ఈ నెల 11న చెన్నైలో జరగనుంది. ప్రముఖ నటుడు, వ్యాపారవేత్త అయిన విషగన్ వనంగమూడిని సౌందర్య రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇద్దరికీ ఇది రెండో పెళ్లే కావడం గమనార్హం. రజనీ ఇంట ఇప్పటికే పెళ్లి వేడుకలు ప్రారంభం కాగా, అతిథులను ఆహ్వానించే పనిలో ‘తలైవా’ బిజీగా ఉన్నాడు.

వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానిస్తున్న రజనీకాంత్ తొలి ఆహ్వాన పత్రికను మాత్రం తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తిరునవుక్కరాసర్‌కు అందించి పెళ్లికి ఆహ్వానించారు. అనంతరం రజనీకాంత్ మాట్లాడుతూ.. సౌందర్య పెళ్లి వెనక తిరు ప్రధాన పాత్ర పోషించారని, అందుకే ఆయనకు తొలి పత్రికను అందించి ఆహ్వానించినట్టు చెప్పారు.

గురువారం  కమల హాసన్ ఇంటికి వెళ్లిన రజనీ తన కుమార్తె పెళ్లికి రావాల్సిందిగా ఆహ్వానించాడు. రజనీ తన ఇంటిలో అడుగుపెట్టగానే కమల్ ఆయనను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు. అనంతరం ఇద్దరూ కలిసి కాసేపు ముచ్చటించుకున్నారు.
Rajinikanth
Kamal Haasan
Soundrya Rajinikanth
Marriage
Tamil Nadu

More Telugu News