Krishna District: నా పట్టు ఉడుం పట్టు.. వదిలిపెట్టే సమస్యే ఉండదు: కేంద్రంపై చంద్రబాబు ఫైర్

  • ఏపీకి అన్యాయం చేసిన కేంద్రాన్ని వదిలే ప్రసక్తే లేదు
  • అభివృద్ధికి అడ్డొచ్చే వారిని  బంగాళాఖాతంలో కలపండి
  • ఎవరు దున్నపోతో మీరు ఆలోచించుకోవాలి
ఏపీకి అన్యాయం చేసిన కేంద్రాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, తన పట్టు ఉడుం పట్టు, సాధించే వరకు వదలనని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. కృష్ణా జిల్లా లోని బందరు పోర్టు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధికి అడ్డు వచ్చే వారిని, ఆటంకాలు సృష్టించే వారిని బంగాళాఖాతంలో కలిపెయ్యాలంటూ బీజేపీ, వైసీపీపై ఆయన విరుచుకుపడ్డారు.

 రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ అసెంబ్లీకి రాదని, ఏ పనీ చేయదని విమర్శించారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులతో సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారని, ఇలాంటి ప్రతిపక్షం మనకు అవసరమా? అని అందరూ ఆలోచించుకోవాలని అన్నారు. నిన్న తిరుపతిలో జరిగిన వైసీపీ ‘సమర శంఖారావం’లో చంద్రబాబు ‘అన్న’ కాదు ‘దున్న’ అంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై ఈ సందర్భంగా బాబు స్పందించారు. తనను ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే ‘ఎవరు దున్నపోతో మీరు ఆలోచించుకోవాలి’ అని అన్నారు. 
Krishna District
machilipatna
Chandrababu
Jagan

More Telugu News