jansena: ‘జనసేన’ అడ్వయిజరీ కౌన్సిల్ సభ్యుడిగా డాక్టర్ వి.పొన్ రాజ్ నియామకం

  • నాడు కలామ్ కు అడ్వయిజర్ గా పొన్ రాజ్ ఉన్నారు
  • అలాంటి వ్యక్తి మా పార్టీలో ఉండటం ఆనందం
  • జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్
జనసేన పార్టీ అడ్వయిజరీ కౌన్సిల్ సభ్యుడిగా డాక్టర్ వి.పొన్ రాజ్ ని నియమించారు. ఈ మేరకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయంలో ఓ కార్యక్రమం నిర్వహించి, పొన్ రాజ్ ని అభినందించారు. అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ కు పొన్ రాజ్ అడ్వయిజర్ గా ఉండే వారని, అలాంటి వ్యక్తిని తమ పార్టీ అడ్వయిజరీ కౌన్సిల్ సభ్యుడిగా ఉండటం తనకు ఆనందాన్ని ఇస్తోందని అన్నారు.

పవన్ లో నాయకత్వ లక్షణాలు మెండు: పొన్ రాజ్

పవన్ కల్యాణ్ ని కలవడం తనకు చాలా సంతోషంగా ఉందని పొన్ రాజ్ అన్నారు. ఏపీపై ఉన్న ఆయన విజన్ ని చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. కేవలం, రాష్ట్రమే కాకుండా దేశం అభివృద్ధి చెందాలన్న ఆలోచన పవన్ ది అని, నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్న పవన్ తో కలిసే పనిచేస్తానని అన్నారు.
jansena
Pawan Kalyan
advisory council
pon raj

More Telugu News