puri akash: పూరి శిష్యుడి దర్శకత్వంలో ఆకాశ్ మూవీ

  • రామ్ ప్రాజెక్టుతో బిజీగా పూరి 
  • అనిల్ పడూరితో ఆకాశ్ పూరి మూవీ
  • ఒకటి రెండు నెలల్లో సెట్స్ పైకి
పూరి తన తనయుడు ఆకాశ్ తో 'మెహబూబా' సినిమా చేశాడు. ప్రేమకథా చిత్రమే అయినప్పటికీ ఈ సినిమా యూత్ ను ఆకట్టుకోలేకపోయింది. అయితే నటన పరంగా ఆకాశ్ కి మంచి మార్కులు పడ్డాయి. దాంతో ఆకాశ్ తో రెండవ సినిమా చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ లోగా రామ్ ప్రాజెక్టు దక్కడంతో .. ఈ సినిమా తరువాత ఆకాశ్ తో చేయనున్నట్టు చెప్పుకున్నారు.కానీ ఆకాశ్ రెండవ సినిమా పూరి చేయడం లేదనేది తాజా సమాచారం. గతంలో పూరి దగ్గర అనిల్ పడూరి దర్శకత్వ శాఖలో పనిచేశాడు. అనిల్ టాలెంట్ గురించి తెలిసిన పూరి, తన తనయుడి సినిమాను ఆయనకి అప్పగించినట్టుగా తెలుస్తోంది. తన పర్యవేక్షణలో .. అనిల్ పడూరి దర్శకత్వంలో ఈ సినిమా నిర్మితమవుతుందన్న మాట. ఒకటి రెండు నెలల్లో ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకు వెళ్లేలా సన్నాహాలు జరుగుతున్నాయి. 
puri akash
anil paduri

More Telugu News