Telangana: నల్గొండ నుంచి లోక్ సభకు పోటీ చేస్తా.. నన్ను గెలిపించే బాధ్యత మీదే!: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

  • కాంగ్రెస్ సర్పంచ్, ఉపసర్పంచ్ లతో భేటీ
  • నేతలు మనోధైర్యం కోల్పోవద్దు
  • గ్రామజ్యోతికి నిధులు ఇవ్వడం లేదు
తెలంగాణ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో నల్గొండ స్థానం నుంచి పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. ఇటీవల తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లు, వార్డు మెంబర్లను అభినందిస్తూ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.

నల్గొండ లోక్ సభ స్థానం నుంచి తనను గెలిపించాల్సిన బాధ్యత మీదేనని కార్యకర్తలు, నేతలకు సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా ఓడిపోయిన కాంగ్రెస్ నేతలు మనోధైర్యం కోల్పోవద్దని కోమటిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలందరికీ అండగా ఉంటానన్నారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామజ్యోతి పథకాన్ని ప్రవేశపెట్టినప్పటికీ నిధులు మాత్రం ఇవ్వడం లేదని మండిపడ్డారు. అంతేకాకుండా కేంద్రం నుంచి మంజూరయ్యే నిధులను దారి మళ్లిస్తున్నారని దుయ్యబట్టారు.
Telangana
Congress
Nalgonda District
loksabha
komati reddy
venkat reddy

More Telugu News