Telangana: పోచారం శ్రీనివాస్‌రెడ్డిని పరామర్శించిన సీఎం కేసీఆర్

షార్ట్స్‌లో చూడండి
మాతృ వియోగంతో బాధలో వున్న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఈ రోజు పరామర్శించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బాన్స్ వాడకు ఈరోజు ఆయన వెళ్లారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పోచారం గ్రామానికి వెళ్లారు. పోచారం తల్లి పాపవ్వ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేసీఆర్ వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ఎంపీ కవిత, మండలి చైర్మన్ స్వామిగౌడ్ తదితరులు ఉన్నారు. కాగా, పోచారం శ్రీనివాస్ రెడ్డి తల్లి పాపవ్వ (107) మంగళవారం రాత్రి కన్నుమూశారు. నిన్న ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.
Go Back to Shorts
Telangana
kcr
pocharaam
srinivasreddy

More Telugu News