Mahesh Babu: డబ్బింగ్ పనులు మొదలెట్టేసిన 'మహర్షి'

షార్ట్స్‌లో చూడండి
మహేశ్ 25వ సినిమాగా 'మహర్షి' రూపొందుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. షూటింగ్ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకోవడంతో, ఈ రోజు ఉదయం పూజా కార్యక్రమాలతో డబ్బింగ్ పనులను మొదలెట్టేశారు. ఇక ఇప్పటి నుంచి డబ్బింగ్ పనులు వేగంగా జరగనున్నాయి. త్వరలో మహేశ్ బాబు కూడా తన పాత్రకి డబ్బింగ్ ను పూర్తి చేస్తాడు.

బలమైన కథాకథనాలతో నిర్మితమవుతోన్న ఈ సినిమాలో మహేశ్ బాబు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. ఆయన సరసన కథానాయికగా పూజా హెగ్డే .. ఆయన ప్రాణ స్నేహితుడిగా అల్లరి నరేశ్ కనిపించనున్నారు. అశ్వనీదత్ .. దిల్ రాజు .. పీవీపీ నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాను, ఏప్రిల్ 25వ తేదీన విడుదల చేయనున్నారు. 'భరత్ అనే నేను' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత మహేశ్ చేస్తోన్న మూవీ కావడంతో భారీ అంచనాలే వున్నాయి.
Go Back to Shorts
Mahesh Babu
pooja hegde

More Telugu News