kamal: కమల్ కోసం అనుకుంటే .. ఆ ఛాన్స్ విక్రమ్ కి దక్కిందట!
- కమల్ సొంత బ్యానర్లో మూవీ
- మలేసియాలో జరుగుతోన్న షూటింగ్
- వేసవిలో ప్రేక్షకుల ముందుకు
మొదటి నుంచి కూడా విక్రమ్ జయాపజయాలను గురించి కాకుండా వైవిధ్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. ప్రయోగాత్మక పాత్రలను ఎంచుకుంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాంటి విక్రమ్ తాజాగా 'కడరం కొందాన్' అనే సినిమా చేస్తున్నారు. కమల్ సొంత బ్యానర్లో నిర్మితమవుతోన్న ఈ సినిమాకి రాజేశ్ ఎం.సెల్వ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.
విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతోన్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ముందుగా కమల్ కథానాయకుడిగానే ఈ సినిమా కథాకథనాలు సిద్ధమయ్యాయి. అయితే రాజకీయాలకే ఎక్కువ సమయం కేటాయించాలని నిర్ణయించుకున్న కమల్, విక్రమ్ తో చేద్దామని చెప్పి ఆయనను సెట్ చేశారట. కమల్ బ్యానర్లో ఇంతవరకూ ముగ్గురు బయట హీరోలు మాత్రమే చేశారు .. ఆ జాబితాలో నాలుగో హీరోగా విక్రమ్ చేరారని చెప్పుకుంటున్నారు. పూర్తిగా మలేసియాలో చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమాను, వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.