ABN: ఏమండీ... లోకేశ్ కు మీ చానల్ చేస్తున్న భజన... వాహ్!: నాగబాబు సెటైర్ల వీడియో

  • నాగబాబు వీడియోను ఆపేయించిన టీడీపీ కార్యకర్తలు
  • ఏబీఎన్ చానల్ లో వచ్చిన స్టోరీని మాత్రమే చూపించా
  • భజన భటుల్లా మారిన ఏబీఎన్ అంటూ సెటైర్లు
'మై చానల్ నా ఇష్టం' అంటూ రాజకీయ నాయకుల వీడియోలు చూపుతూ వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్న నటుడు నాగబాబు, మరో వీడియోను పెట్టారు. ఇటీవల లోకేశ్ దావోస్ పర్యటనపై సెటైర్లు వేస్తూ వీడియో పెట్టడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి వచ్చిన ట్రోలింగ్ ను ఆయన ప్రస్తావించారు. తన చానల్ లోని వీడియోను ఆపేయించడాన్ని తప్పుబట్టారు. ఏబీఎన్ చానల్ లో వచ్చిన స్టోరీని మాత్రమే తాను చూపించానని, దానిపై తన అభిప్రాయాన్ని చెప్పానే తప్ప, ఎవరిపైనా వ్యక్తిగత దూషణలకు దిగలేదని అన్నారు. ఓ మహిళ బూతు మాటలు మాట్లాడితే, అది వాడుక భాషేనని సమర్థించిన టీడీపీ వారు, తాను ఒక్క తప్పు మాట కూడా మాట్లాడకపోయినా, తనను విమర్శించడం ఏంటని ప్రశ్నించారు.

"మీరు దావోస్ లో లోకేశ్ పర్యటనను గురించి రిపోర్టింగ్ ఎలా ఇచ్చారో తెలుసా?... 'మాయాబజార్' చూశారుకదా? 'మాయాబజార్'లో లక్ష్మణ కుమారుడి పక్కన ఇద్దరుంటారు. అల్లు రామలింగయ్యగారు, ఇంకొకాయన... కవచమిది కవచమిది పరమం పవిత్రం... అనే ఇద్దరు భజన భటులుంటారు. మీ చానలు, మీరు చెప్పే భజన ఎబౌట్ నారా లోకేశ్ గురించి, చంద్రబాబు గురించి... అంతకన్నా చెప్పేదేమీ లేదు" అంటూ తనదైన శైలిలో తాళం వాయిస్తూ మాట్లాడారు. 'యూ కెెన్ నెవర్ కిల్ మై ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్' అని హెచ్చరించారు.
ABN
Nagababu
My Channel Naa Istam
Nara Lokesh

More Telugu News