ntr: రాజమౌళి సినిమాలో కీలకమైన పాత్రలో ప్రియమణి

  • షూటింగు దశలో రాజమౌళి మూవీ
  • కథానాయికలుగా తెరపైకి కొందరి పేర్లు
  • గతంలో 'యమదొంగ' చేసిన ప్రియమణి
ఇప్పుడు అందరి దృష్టి రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర్' ప్రాజెక్టు పైనే వుంది. ఈ సినిమాకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అంతా ఆసక్తిని చూపుతున్నారు. ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా చేస్తోన్న ఈ సినిమా, ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో కథానాయికలుగా కీర్తి సురేశ్ .. పరిణీతి చోప్రా .. అలియా భట్ పేర్లు వినిపిస్తున్నాయి.

ఇక ఒక కీలకమైన పాత్ర కోసం ప్రియమణి పేరును పరిశీలిస్తున్నట్టుగా కొన్ని రోజుల క్రితం ఒక వార్త వచ్చింది. ఆమెతో సంప్రదింపులు మొదలయ్యాయనేది తాజా సమాచారం. ఈ సినిమాలో 'సముద్రఖని' చేయనున్నట్టుగా వార్తలు వచ్చాకే, అది నిజమేనన్న విషయాన్ని ఆయన ధ్రువీకరించాడు. ఇక ప్రియమణితో సంప్రదింపుల గురించి వస్తోన్న వార్తలపై ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి. గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'యమదొంగ'లో ప్రియమణి హీరోయిన్ గా చేసిన విషయం తెలిసిందే. 
ntr
charan
priyamani

More Telugu News