Prakasam District: నేడు సీఎంతో చీరాల ఎమ్మెల్యే ఆమంచి భేటీ.. తర్వాత నిర్ణయం ప్రకటన!

  • టీడీపీలో ఉంటారా...తనదారి తాను చూసుకుంటారా?
  • సీఎంతో భేటీ అనంతరం నిర్ణయం చెబుతానన్న కృష్ణమోహన్‌
  • ఇప్పటికే పలువురు కాపు నేతలతో చర్చ
నాలుగు రోజుల నుంచి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే అమంచి కృష్ణమోహన్‌ నిర్ణయం ఏమిటన్నది ఈ రోజు తేలిపోతుందని భావిస్తున్నారు. నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా ఉన్న వారికి పార్టీ పదవులు కట్టబెట్టడంతో గత కొంతకాలంగా టీడీపీ అధిష్ఠానం పట్ల అలకతో ఉన్న కృష్ణమోహన్‌ వైసీపీ వైపు అడుగులు వేస్తున్నారన్న వార్తలు వచ్చాయి.

దీంతో అప్రమత్తమైన అధిష్ఠానం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులను రంగంలోకి దించింది. త్రిమూర్తులు పిలుపు మేరకు కృష్ణమోహన్‌ బుధవారం సాయంత్రం రామచంద్రాపురం వెళ్లి ఏకాంతంగా దాదాపు రెండు గంటలపాటు చర్చించారు. పలువురు కాపు నేతలను కూడా ఆయన కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గురువారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలవనున్నానని, ఆ తర్వాత తన తుది నిర్ణయం ప్రకటిస్తానని స్పష్టం చేశారు. చంద్రబాబును కలిసిన తర్వాత కృష్ణమోహన్‌ నిర్ణయం ఏమిటన్న అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
Prakasam District
cherala MLA
amanchi krishnamohan

More Telugu News