Jagan: అబ్బే, అదేమంత పెద్దది కాదు.. జగన్‌కు అయిన గాయంపై కేంద్రం వివరణ

  • జగన్‌పై దాడి కేసుకు సంబంధించి ప్రశ్నించిన విజయసాయి రెడ్డి
  • సమాధానం ఇచ్చిన కేంద్రమంత్రి హన్స్‌రాజ్
  • పెద్ద గాయం కాదని వివరణ
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి ఘటనలో అయిన గాయం చిన్నదేనని కేంద్రం స్పష్టం చేసింది. బుధవారం రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లిఖిత పూర్వకంగా అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్ అహిర్ తెలిపారు. గతేడాది  అక్టోబరు 25న విశాఖ విమానాశ్రయంలోని ఫ్యూజన్ ఫుడ్ రెస్టారెంట్ ఉద్యోగి జగన్‌పై దాడి చేశారని పేర్కొన్నారు. ఈ దాడిలో జగన్‌కు అయిన గాయం చిన్నదేనని, దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వివరించారు. కేసును ఎన్ఐఏకి అప్పగించినట్టు తెలిపారు.
Jagan
YSRCP
Kodikathi
Visakhapatnam District
Airport
vijayasai Reddy

More Telugu News