YSRCP: వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తుపెట్టుకోం..ఒంటరిగానే పోటీ చేస్తాం: వైఎస్ జగన్

  • కాంగ్రెస్, బీజేపీ సహా అన్ని పార్టీలు మోసం చేశాయి
  • ఆ పార్టీలకు ఓటు వేయొద్దు
  • చీకటి తర్వాత వెలుగులా వైసీపీ అధికారంలోకొస్తుంది
గత ఎన్నికల్లో మాదిరే వచ్చే ఎన్నికల్లోనూ ఎవరితో పొత్తుపెట్టుకోమని, ఒంటరిగానే పోటీ చేస్తామని వైసీపీ అధినేత జగన్ మరోసారి స్పష్టం చేశారు. తిరుపతిలో నిర్వహించిన ‘సమర శంఖారావం’లో ఆయన మాట్లాడుతూ, ‘హోదా’పై ఎవరు సంతకం పెడతారో వారికే తమ మద్దతిస్తామని మరోసారి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 25కు 25 ఎంపీ స్థానాలను మనమే గెలుచుకుందామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ సహా అన్ని పార్టీలు రాష్ట్ర ప్రజలను మోసం చేశాయని, ఆ పార్టీలకు ఓటు వేయొద్దని సూచించారు. ఓటు వేయమని చంద్రబాబు డబ్బులిస్తే తీసుకోమని, ఓటు మాత్రం మనస్సాక్షి చెప్పినట్టు వేయాలని వ్యాఖ్యానించారు. చీకటి తర్వాత వెలుగు ఎలా వస్తుందో, అలాగే, వైసీపీ అధికారంలోకి రాబోతోందని జగన్ ధీమా వ్యక్తం చేశారు.
YSRCP
Jagan
Tirupati
samara shankaravam
Chiranjeevi
Congress
bjp
Telugudesam

More Telugu News