అయోధ్య రామాలయంపై మీ అభిప్రాయం ఏమిటో స్పష్టం చేయండి: అమిత్ షా డిమాండ్
- రామాలయాన్ని నిర్మించాలని బీజేపీ కోరుకుంటోంది
- నిర్మించాలా, వద్దా అనే విషయాన్ని మీరు స్పష్టంగా చెప్పండి
- రానున్న ఎన్నికలు మోదీకి, ఇతరులకు మధ్య జరగబోతున్నాయి
ఉత్తరప్రదేశ్ లోని గూండాలపై బీజేపీ ఉక్కుపాదం మోపిందని... ల్యాండ్ మాఫియా సమస్యకు సీఎం యోగి ఆదిత్యనాథ్ చెక్ పెట్టారని అమిత్ షా అన్నారు. యోగి పాలనలో రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. పైన మోదీ ఉన్నారని... కింద యోగి ఆదిత్యనాథ్ ఉన్నారని... రానున్న ఎన్నికలు మోదీకి, మిగిలిన వారికి మధ్య జరగబోతున్నాయని తెలిపారు. బీజేపీ కార్యకర్తలే తమ పార్టీకి ఘన విజయం కట్టబెడతారని... తమ పార్టీకి నాయకుల అండ అవసరం లేదని చెప్పారు.