kapu: కాపుల రిజర్వేషన్ల బిల్లుపై న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తాం: కొత్తపల్లి సుబ్బారాయుడు

  • అవసరమైతే కోర్టులో కేవియట్ కూడా వేస్తాం
  • కాపులకు 5 శాతం రిజర్వేషన్లలో ఎలాంటి తప్పులేదు
  • కేంద్రానికి  నివేదిక పంపినా ఎలాంటి స్పందన లేదు
కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ల బిల్లు విషయమై న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తామని ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అవసరమైతే కోర్టులో కేవియట్ కూడా వేస్తామని స్పష్టం చేశారు. అగ్రవర్ణాల పేదల్లో 50 శాతం ఉన్న కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించడంలో ఎలాంటి తప్పులేదని అన్నారు. బీసీ హోదా కోసం కేంద్రానికి  నివేదిక పంపినా ఎలాంటి స్పందన లేదని విమర్శించారు. కాగా, బీసీలకు ఐదు శాతం రిజర్వేషన్ల బిల్లుపై అసెంబ్లీలో రేపు చర్చ జరగనుంది.
kapu
resevations
bill
Andhra Pradesh
kottapalli

More Telugu News