delhi: మోదీ పాలనలో దేశంలో అశాంతి నెలకొంది: ఏపీ టీడీపీ ఎంపీలు

  • ఏపీకి ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చాలి  
  • కొన్ని రాష్ట్రాలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు
  • పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీలు
ప్రధాని మోదీ పాలనలో దేశంలో అశాంతి నెలకొందని ఏపీ టీడీపీ ఎంపీలు విమర్శించారు. ఏపీకి ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చాలంటూ పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీలు చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది. ‘మోదీ హఠావో దేశ్ బచావో’ అంటూ ఎంపీలే నినదించారు. ఈ సందర్భంగా ఎంపీ మురళీమోహన్ మాట్లాడుతూ, గుజరాత్ తో పాటు తన అనుకూల రాష్ట్రాలకే మోదీ నిధులు కేటాయిస్తున్నారని, కొన్ని రాష్ట్రాలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టీడీపీకి చెందిన మరో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వాలే కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన పరిస్థితిని మోదీ తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు.
delhi
parliament
Telugudesam
Chandrababu
mp`s

More Telugu News