Andhra Pradesh: కౌలు రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాం.. రైతన్నలను అన్ని రకాలుగా ఆదుకుంటాం!: ఏపీ మంత్రి ప్రత్తిపాటి

  • 5.13 లక్షల మంది కౌలు రైతులకు రుణాల కార్డులు
  • రుణాలను పొందిన 2.62 లక్షల మంది
  • ఏపీ అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి
ఆంధ్రప్రదేశ్ లో కౌలు రైతుల సంక్షేమంపై టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మందికిపైగా కౌలు రైతులకు ‘రుణ అర్హత కార్డులు’ మంజూరు చేశామని, వీరిలో 2.62 లక్షల మంది రైతులు రుణాలను పొందారని పేర్కొన్నారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి ఈ మేరకు స్పందించారు. ఇప్పటివరకూ 5.13 లక్షల రైతు రుణ అర్హత కార్డులను రెవిన్యూ శాఖ జారీచేసిందని మంత్రి తెలిపారు. అర్హులైన కౌలు రైతులకు బ్యాంకర్లు వెంటనే రుణాలను మంజూరు చేస్తున్నారని అన్నారు. రైతులను టీడీపీ ప్రభుత్వం అన్నిరకాలుగా ఆదుకుంటుందని స్పష్టం చేశారు.
Andhra Pradesh
prattipati
pulla rao
farmers
minister

More Telugu News