Andhra Pradesh: ప్రభుత్వ పథకాల అమలులో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వండి!: అధికారులకు చంద్రబాబు ఆదేశం

  • అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చేలా బడ్జెట్
  • దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది
  • టీడీపీ నేతలతో సీఎం టెలీకాన్ఫరెన్స్
ఆంధ్రప్రదేశ్ లో అన్నివర్గాలకు లబ్ధి చేకూర్చేలా బడ్జెట్ ను ప్రవేశపెట్టామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ బడ్జెట్ పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. తమ ప్రభుత్వం సమర్థత వల్లే ఎన్ని కష్టాలు ఉన్నా సంక్షేమ పథకాలను అమలు చేయగలుగుతున్నామని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలతో ఈ రోజు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడారు.

ఏపీలో ఎవ్వరినీ నిరాదరణకు గురికానివ్వబోమని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాల అమలులో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. బీసీ కార్పొరేషన్ పరిధిలోకి రాని, అసలు కార్పొరేషన్ లేనివారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సూర్యబలిజ, కూరాకుల, అచ్చుకట్లవాండ్ల, జక్కల సామాజికవర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
Andhra Pradesh
Chandrababu
Telugudesam
TELE CONFERENCE
BUDGET

More Telugu News