Chigurupati Jayaram: త్వరలో అన్ని విషయాలూ చెబుతా: శిఖా తల్లి, జయరామ్ సోదరి సుశీల!

  • ప్రస్తుతం కానూరులో ఉంటున్న సుశీల
  • ఆమెపైనే అనుమానం ఉందన్న పద్మశ్రీ
  • ఏం చేబుతారన్న విషయమై ఆసక్తి
చిగురుపాటి జయరామ్ హత్య కేసులో ఆమె సోదరి, ఆరోపణలు ఎదుర్కొంటున్న శిఖా చౌదరి తల్లి సుశీల స్పందించారు. ఓ మీడియా చానల్ తో మాట్లాడిన ఆమె, అతి త్వరలో తాను మీడియా ముందుకు వచ్చి అన్ని వివరాలనూ వెల్లడిస్తానని అన్నారు. ఈ కేసులో శిఖా చౌదరి పాత్ర ఉందని అనుమానిస్తున్న సంగతి తెలిసిందే.

 ప్రస్తుతం సుశీల విజయవాడ సమీపంలోని కానూరులో నివాసం ఉంటుండగా, అప్పడప్పుడూ శిఖా, జయరామ్ లు ఆమె వద్దకు వచ్చి వెళుతుండేవారని తెలుస్తోంది. ఇక తన మామయ్య జయరామ్ తో తనకు సన్నిహిత సంబంధం ఉందని, అది తన వ్యక్తిగత విషయమని, రాకేశ్ ఆయన్ను ఎందుకు హత్య చేశాడో తనకు తెలియదని పోలీసుల విచారణలో శిఖా వెల్లడించినట్టు వార్తలు వచ్చాయి.

ఇదే సమయంలో తన భర్తకు ఆయన సోదరి నుంచే ప్రాణహాని ఉందని పద్మశ్రీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో శిఖా ప్రమేయం లేదని, హత్య వెనుక ఆమె కుట్ర లేదని నిన్న నందిగామ పోలీసులు వెల్లడించిన నేపథ్యంలో, సుశీల మీడియా ముందు ఏం చెబుతారు? తన కుమార్తెపై వచ్చిన ఆరోపణలపై ఎలా స్పందిస్తారన్న విషయాలపై ఆసక్తి నెలకొంది.
Chigurupati Jayaram
Padmashri
Shrika Chowdary
Murder

More Telugu News