kuppam: కుప్పంలో చంద్రబాబును భూస్థాపితం చేస్తా..పులివెందులలో జగన్ పై పోటీకి సిద్ధం: కేఏ పాల్

  • ఏపీని చంద్రబాబు నాశనం చేశారు
  • పవన్ కల్యాణ్ నాతో కలిసి రావాలి
  • చిన్న చిన్న పార్టీలన్నీ నాతో కలవాలి
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత జగన్, జనసేన వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ లపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఏపీని చంద్రబాబు నాశనం చేశారని ఆరోపించారు. కుప్పంలో చంద్రబాబును భూస్థాపితం చేస్తానని, పులివెందులలో జగన్ పై పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, చిన్న చిన్న పార్టీలన్నీ తనతో కలిసి రావాలని కోరారు. తాను అధికారంలోకి వస్తే ప్రతి నియోజకవర్గానికి ఓ కార్పొరేట్ ఆసుపత్రి నిర్మిస్తానని హామీ ఇచ్చారు.
kuppam
Chandrababu
pulivendula
Jagan
ka pal
prajashanti party
YSRCP
Telugudesam

More Telugu News