kolkata: బీజేపీ అన్ని విపక్ష పార్టీలను నాశనం చేయాలని చూస్తోంది: సీఎం చంద్రబాబు

  • దేశ భవిష్యత్తు కోసం 23 పార్టీలు ఏకమయ్యాయి
  • ఇకపై, ఏ నిర్ణయమైనా ఐక్యంగా తీసుకుంటాం
  • ఎన్డీఏ ప్రభుత్వ చర్యలతో దేశ సమగ్రతకు భంగం 

బీజేపీ అన్ని విపక్ష పార్టీలను నాశనం చేయాలని చూస్తోందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు. కోల్ కతాలో సీఎం మమతా బెనర్జీ నిర్వహిస్తున్న ధర్నాకు సంఘీభావం తెలిపేందుకు ఈరోజు మధ్యాహ్నం ఆయన అక్కడికి వెళ్లారు. ఈ ధర్నాకు తన మద్దతు తెలిపిన అనంతరం, మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ, ప్రతిపక్ష పార్టీల రాష్ట్రాల్లో అభివృద్ధిని అడ్డుకోవాలని కేంద్రం చూస్తోందని, ఏపీ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో అభివృద్ధిని అడ్డుకుంటోందని దుయ్యబట్టారు.

రాష్ట్రాలు అభివృద్ధి చెందినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని, దేశ భవిష్యత్తు కోసం 23 పార్టీలు ఏకమయ్యాయని మరోసారి పేర్కొన్నారు. ఇకపై, ఏ నిర్ణయమైనా ఐక్యంగా తీసుకుంటామని, కేంద్రంలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని, ఎన్డీఏ ప్రభుత్వ చర్యల వల్ల దేశ సమగ్రతకు భంగం వాటిల్లుతోందని, నరేంద్ర మోదీ, అమిత్ షా మినహా మిగతా వారంతా అవినీతిపరులనే ముద్ర వేస్తున్నారని ఆరోపించారు.

More Telugu News