budda venkanna: జీవీఎల్ ను బెదిరించడానికి నేను ఈ వ్యాఖ్యలు చేయడం లేదు: బుద్ధా వెంకన్న

  • జీవీఎల్ ఒక పిచ్చోడు... పిచ్చోడి చేతికి మోదీ రాయి ఇచ్చారు
  • చంద్రబాబును విమర్శించేందుకే జీవీఎల్ కు పదవి ఇచ్చారు
  • జీవీఎల్ నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడాలి
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జీవీఎల్ ఒక పిచ్చోడని.... పిచ్చోడి చేతికి ప్రధాని మోదీ రాయి ఇచ్చారని అన్నారు. కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించేందుకే జీవీఎల్ కు మోదీ పదవి ఇచ్చారని విమర్శించారు. జీవీఎల్ నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడాలని... లేకపోతే దేహశుద్ధి తప్పదని హెచ్చరించారు. వైసీపీలో మాత్రమే పిచ్చోళ్లు ఉన్నారని మొన్నటి వరకు అనుకున్నామని... బీజేపీలో కూడా ఇప్పుడు పిచ్చోళ్లు తయారయ్యారని ఎద్దేవా చేశారు. జీవీఎల్ ను హెచ్చరించడానికో, బెదిరించడానికో తాను ఈ వ్యాఖ్యలు చేయడంలేదని... రాజకీయ నాయకుల నోటికి హద్దు, పద్దు ఉండాలని అన్నారు. బీజేపీ, వైసీపీలకు రోజులు దగ్గర పడ్డాయని చెప్పారు.
budda venkanna
gvl
Chandrababu
modi
Telugudesam
bjp
ysrcp

More Telugu News