YSRCP: పోలీస్ వాళ్లకు కులం ఉండదు.. మాది ఖాకీ కులం!: జగన్ ఆరోపణలపై ఏపీ డీజీపీ స్పందన

  • జగన్ చేసిన ఆరోపణలు మీడియాలో చూశాను
  • పోలీస్ వాళ్లకు కులం ఉండదు..మాది ఖాకీ కులం
  • మెరిట్ ప్రకారమే పదోన్నతులు ఇచ్చారు
ఏపీ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో డీజీపీ ఠాకూర్ పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని, సీనియర్లను పక్కన పెట్టి ఠాకూర్ ను డీజీపీగా నియమించారని వైసీపీ అధినేత జగన్ నిన్న ఢిల్లీలో ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ చేసిన వ్యాఖ్యలపై ఠాకూర్ స్పందించారు. జగన్ చేసిన ఆరోపణలు మీడియాలో చూశానని, పోలీస్ వాళ్లకు కులం ఉండదని, తమది ఖాకీ కులమని అన్నారు.

హైకోర్టు ఆదేశాల మేరకు మెరిట్ ప్రకారమే పదోన్నతులు ఇచ్చారని, ఈ ఆరోపణలపై ఎన్నికల సంఘం అడిగితే తాను సమాధానమిస్తానని అన్నారు. తాను  నిజాయతీగా పని చేస్తున్నానని, అవినీతి నిరోధక శాఖ డీజీగా తన పని తీరేంటో ప్రజలకు తెలుసని ఈ సందర్భంగా ఠాకూర్ గుర్తుచేశారు. కాగా, తనపై దాడి జరిగితే ఎలాంటి విచారణ జరగక ముందే గంట లోపే చంద్రబాబు తరఫున డీజీపీ వకాల్తా పుచ్చుకుని ఆయనకు కొమ్ముకాశారని జగన్ నిన్న ఆరోపించారు.
YSRCP
Jagan
Andhra Pradesh
ap dgp
thakur

More Telugu News