amanchi krishnamohan: వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి?

  • పందిళ్లపల్లిలోని నివాసంలో సన్నిహితులతో సమావేశం  
  • అనుచరులు, కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకుంటున్న ఆమంచి 
  • ఈ నెల 13న జగన్ సమక్షంలో వైసీపీలో చేరే అవకాశం
టీడీపీకి మరో నేత షాకివ్వబోతున్నట్టు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడబోతున్నారని సమాచారం. పార్టీ మార్పుపై తన అనుచరులు, కార్యకర్తల అభిప్రాయాలను ఆయన తెలుసుకుంటున్నారు. వైసీపీలోకి ఆయన వెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఈ నెల 13న వైసీపీ అధినేత జగన్ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన వైకాపా తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. ఇదే విషయమై చర్చించేందుకు పందిళ్లపల్లిలోని తన నివాసంలో సన్నిహితులు, ముఖ్య కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు.
amanchi krishnamohan
chirala
Telugudesam
ysrcp

More Telugu News