Krishna District: ఊరంతా కరెంట్ తీసేసి... శిఖా చౌదరిని రహస్యంగా తరలించిన నందిగామ పోలీసులు!

  • కృష్ణా జిల్లా నందిగామలో హైడ్రామా
  • రెండు వాహనాలను సిద్ధం చేసుకున్న పోలీసులు
  • ఒకటి హైదరాబాద్ వైపు, మరొకటి విజయవాడవైపు
ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరామ్ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ, గత ఐదు రోజులుగా కృష్ణా జిల్లా నందిగామ పోలీసు స్టేషన్ లోనే ఉన్న శిఖా చౌదరిని పోలీసులు గత రాత్రి హైడ్రామా మధ్య రహస్య ప్రాంతానికి తరలించారు. ఊరంతా కరెంట్ తీసేసిన పోలీసులు, అంతకుముందే రెండు వాహనాలను స్టేషన్ ముందు సిద్ధం చేసివుంచారు.

ఒక వాహనంలో శిఖాను ఎక్కించారు. ఏ వాహనంలో ఆమె ఉందో మీడియా కంటపడకుండా జాగ్రత్త పడ్డారు. ఆపై రెండు వాహనాల్లో ఒకటి విజయవాడవైపు, మరొకటి హైదరాబాద్ వైపు వెళ్లిపోయాయి. ఈ వాహనాలను మీడియా వెంబడించినా, ఆమె ఎందులో ఉందన్న విషయం మాత్రం తెలుసుకోలేకపోయారు. కాగా, జయరామ్ హత్య హైదరాబాద్ లో జరిగినట్టు తేలడంతో, కేసును అక్కడి పోలీసులకే అప్పగించాలని నిర్ణయించుకున్న కృష్ణా జిల్లా ఉన్నతాధికారులు, ఆమెను హైదరాబాద్ కే తరలించినట్టు తెలుస్తోంది.
Krishna District
Nandigama
Jayaram
Hyderabad
Police
Shrika

More Telugu News